- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం! జ్యోతి మిర్దా సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ సారి కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడితే, దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని ప్రతిపక్షాలు నిరంతరం వాదిస్తున్న సంగతి తెలిసిందే. విపక్షాల ఈ వాదనల మధ్య రాజస్థాన్‌లోని నాగౌర్‌కు చెందిన లోక్‌సభ బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైంది. అందులో ఆమె రాజ్యాంగంలో మార్పుల గురించి మాట్లాడటం కనిపిస్తుంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘కొన్ని సార్లు కఠోర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం మనం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అందుకు లోక్‌సభ, రాజ్యసభ రెండింట్లో బలం కావాలి. లోక్‌సభలో బీజేపీకి కావల్సినంత మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో మాత్రం తక్కువ మెజారిటీ ఉందన్నారు. మూడోసారి కూడా ఎన్‌డీఏ సర్కార్ వస్తేనే ఇదంతా సాధ్యం’ అని మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కాగా, గత ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జ్యోతి మిర్ధా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు.