IAF fighter jet:గాల్లో ఉన్న ఫైటర్ జెట్ నుంచి జారిపడ్డ సామగ్రి..!

by Shamantha N |   ( Updated:2024-08-21 10:23:43.0  )
IAF fighter jet:గాల్లో ఉన్న ఫైటర్ జెట్ నుంచి జారిపడ్డ సామగ్రి..!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వాయుసేన యుద్ధవిమానం నుంచి సామగ్రి జారిపడింది. గాల్లో ఉండగానే సామగ్రి జారిపడినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ లో వాయుసేన ధ్రువీకరించింది. “సాంకేతిక లోపం కారణంగా పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ఏరియా దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ఎయిర్ స్టోర్ అనుకోకుండా విడుదలైంది. ఈ ఘటనపై విచారణకు ఐఏఎఫ్ ఆదేశించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.” అని పేర్కొంది. అయితే, ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక లోపం కారణంగా ఘటన జరిగినట్లు వెల్లడించారు. సాధారణంగా ఆయుధాలు, బాంబులు లేదా ఇతర సైనిక సామగ్రిని ఈ విమానాల ద్వారా తీసుకెళ్తారు. సాధారణ ఆపరేషన్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక లోపం ఎందుకు ఏర్పడిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాంకేతిక లోపానికి గల కారణాలపై విచారణకు ఆదేశించామని ఐఏఎఫ్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed