బెదిరింపులకు భయపడబోను..జై పాలస్తీనా వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందన

by vinod kumar |
బెదిరింపులకు భయపడబోను..జై పాలస్తీనా వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓ వైసీ జై పాలస్తీనా నినాదాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఆయన నినాదాలపై పలువురు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ తన వ్యాఖ్యలపై బుధవారం స్పందించారు. ఉత్తుత్తి బెదిరింపులకు తాను భయపడబోనని తెలిపారు. ‘వాళ్లు ఏమైనా చేసుకోనివ్వండి.. రాజ్యాంగం గురించి నాకు కూడా తెలుసు..ఈ నకిలీ బెదిరింపులు నాపై పని చేయవు’ అని చెప్పారు. నేను చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం కావని తెలిపారు. నేను కేవలం జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని మాత్రేమే పలికానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను ఖండించే ఒక్క నిబంధన కూడా రాజ్యాంగంలో లేదని స్పష్టం చేశారు. పాలస్తీనాకు సంబంధించి మహాత్మా గాంధీ కూడా చాలా విషయాలు చెప్పారని గుర్తు చేశారు. కాగా, అసదుద్దీన్ వ్యాఖ్యలకు గాను ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed