Navy Chief: అగ్నివీరుల్లో సాధించాలనే తపనను చూస్తున్నా

by Shamantha N |
Navy Chief: అగ్నివీరుల్లో సాధించాలనే తపనను చూస్తున్నా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్గా దగ్గర నాల్గో బ్యాచ్ అగ్నివీర్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొన్నారు. అగ్నివీరుల్లో సాధించాలనే తపనను చూస్తున్నాని అన్నారు. మొదటి మూడు బ్యాచ్‌ల్లో 2,500 మంది అగ్నివీర్లు తమ శిక్షణను పూర్తి చేశారని పేర్కొన్నారు. "2022లో అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టినప్పుడు చీఫ్ ఆఫ్ పర్సనల్‌ని.రెండేళ్ల తర్వాత ఐఎన్ఎస్ చిల్కా నుంచి నాల్గో బ్యాచ్ ఉత్తీర్ణత సాధించడాన్ని చూస్తున్నాం. ఇప్పటివరకు 2,500 మందికి పైగా అగ్నివీరులకు శిక్షణ ఇచ్చాం” అని త్రిపాఠి అన్నారు. ఈ బ్యాచ్ లో 1,429 మంది అగ్నివీరులు ఉన్నారని.. వారిలో దాదాపు 300 మంది మహిళలున్నట్లు తెలిపారు. “అగ్నివీరుల్లో గొప్ప ఆశను చూస్తున్నా. వారు ఉత్సుకతో ఉన్నారు. నేవీకి తగినట్లు వారిని వారు తీర్చుదిద్దుకున్నారనే నమ్మకం ఉంది" అని అన్నారు.

16 వారాల శిక్షణ

అగ్నివీరులకు 16 వారాల శిక్షణ పూర్తయ్యింది. చిల్కాలో విద్యాపరమైన బోధన, నేవీ సేవలు, వివిధ అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. ఇకపోతే, జూన్ 2022లో ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్న ప్రారంభించింది. సాయుధ దళాల్లో యువతను ఈ పథకం కింద రిక్రూట్ చేసుకుంటుంది. వారిని అగ్నివీరులుగా పిలుస్తారు. నాలుగు సంవత్సరాల పాటు రక్షణ దళాల్లో సేవ చేస్తారు. ఆ తర్వాత సాయుధ దళాలు సహా అనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed