CJI DY Chandrachud: 'పీరియడ్స్ టైంలో వర్క్‌ ఫ్రం హోం'

by Vinod kumar |
CJI DY Chandrachud: పీరియడ్స్ టైంలో వర్క్‌ ఫ్రం హోం
X

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో సేవలందించే మహిళా లా క్లర్క్‌లకు పీరియడ్స్ టైంలో వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించే ఉదార పద్ధతిని తానే మొదలుపెట్టానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు. కోర్టులో పనిచేసే నలుగురు మహిళా లా క్లర్క్‌లకు ఈ వెసులుబాటును తాను అందిస్తున్నానని చెప్పారు. సుప్రీంకోర్టులోని మహిళల వాష్‌రూమ్‌లలో శానిటరీ న్యాప్‌కిన్‌ల డిస్పెన్సర్‌లను కూడా అందుబాటులో ఉంచామన్నారు.

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ 31వ వార్షిక స్నాతకోత్సవానికి సీజేఐ చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనం చేసే ప్రతి జాబ్.. మరో ఉద్యోగానికి బదిలీ చేయగల ఎన్నో నైపుణ్యాలను అందిస్తుందని చెప్పారు. ‘మీరు ప్రపంచానికి ఏం చేయగలుగుతున్నారనే ప్రశ్నతో ముందుకు సాగండి.. ప్రెజెంట్ టైంలోనే బతికేందుకు ప్రయత్నించండి ’ అని లా స్టూడెంట్స్‌కు సూచించారు. ‘మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఈ జీవిత ప్రయాణంలో మిమ్మల్ని ఆ ఎత్తులకు చేర్చిన నిచ్చెనల లాంటి వాళ్లను ఎప్పుడూ దూరం చేసుకోండి’ అని కోరారు.

Advertisement

Next Story