- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi : ‘ఐ లవ్ వయనాడ్’.. ఆకట్టుకుంటున్న రాహుల్ టీషర్ట్
దిశ, వెబ్ డెస్క్ : వయనాడ్(Wayanad) లోక్ సభ స్థానం ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నియోజకవర్గ ప్రజల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను మరోసారి ప్రదర్శించారు. తన సోదరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి(Congress MP candidate) ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)కి మద్దతుగా రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ప్రచార సభకు ‘ఐ లవ్ వయనాడ్’(I love Wayanad) అని లవ్ సింబల్ తో రాసి ఉన్న తెల్లటి టీ షర్టును ధరించి హాజరయ్యారు. రాహుల్ గాంధీ సభా వేదికపైకి రాగానే సోదరి ప్రియాంక గాంధీ ఆయనను తన వైపు తిప్పుకుని మరి ఆ టీ షర్టును ఆసక్తిగా తిలకించారు. అనంతరం రాహుల్ గాంధీ సభా వేదికపై నుంచి ప్రజలకు తను ధరించిన ఐ లవ్ వయనాడ్ నినాదంతో ఉన్న టీ షర్టును చూపించారు. అది చూసిన వయనాడ్ ప్రజలు ఈలలు, కేరింతలతో తమ హర్షద్వానాలు వ్యక్తం చేశారు.
అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి 2019, 2024పార్లమెంటు ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన రాహుల్ గాంధీ ఈ దఫా రాయ్ బరేలీ స్థానం ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలో వయనాడ్ ఎంపీ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప ఎన్నిక జరుగుతుండగా, తన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు.