జమిలీకి నేను వ్యతిరేకం : Kamal Haasan

by Y. Venkata Narasimha Reddy |
జమిలీకి నేను వ్యతిరేకం : Kamal Haasan
X

దిశ, వెబ్ డెస్క్ : జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించేవారి జాబితాలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా చేరిపోయారు. జమిలి ఎన్నికల విధానం ప్రమాదకరమని.. లోపభూయిష్టమైనదని ఆందోళన వ్యక్తంచేశారు. దాని మచ్చలు కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఉన్నాయని...భారతదేశానికి ఏక కాల ఎన్నికల ప్రక్రియ అవసరం లేదన్నారు. భవిష్యత్తులో కూడా దీని అవసరం ఉండదని కమల్‌ పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నిలు జరిగితే అది నియంతృత్వానికి, వాక్‌ స్వాతంత్య్రానికి, ఒకే నాయకుడి ఆధిపత్యానికి దారి తీస్తుందని కమల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2014 లేక 2015 సమయంలో ఈ తరహాలో ఎన్నికలు జరిగి ఉంటే.. ఒక పార్టీకే పూర్తి అధికారం దక్కేదని.. అది నియంతృత్వానికి దారితీసేదని..వాక్ స్వాతంత్ర్యం కోల్పోయేవాళ్లమన్నారు. ఒక్క నాయకుడే ఆధిపత్యం చెలాయించేవారని.,.. దాని నుంచి మనం తప్పించుకున్నామని అర్థం చేసుకోవాలని.. ఆ పరిస్థితి కరోనాకంటే ప్రమాదకరమైంది" అని పేర్కొన్నారు. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కమల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Next Story

Most Viewed