దారుణం: మైనర్ భార్యను కిరాతకంగా హత్యచేసిన భర్త..

by Anjali |
దారుణం: మైనర్ భార్యను కిరాతకంగా హత్యచేసిన భర్త..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని.. దారుణంగా హత్య చేసిన ఘటన త్రిపురలోని అగర్తలాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కయెమ్ అనే వ్యక్తి 8నెలల క్రితం 15 ఏళ్ల బాలికను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు ముస్లింపారా అనే ప్రాంతంలో ఇల్లు అద్దె తీసుకొని ఉంటున్నారు. కాగా.. శుక్రవారం(ఏప్రిల్ 28) ఉదయం నుంచి ఆ అమ్మాయి ఫోన్ తీయడం లేదు. ఏం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో రక్తపు మరకలు చూసి బాలిక తల్లి భయంతో బోరున విలపించింది.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఈ క్రమంలోనే ఎస్‌డిపిఓ ఆశిష్ దాస్‌గుప్తా నేత‌ృత్వంలోని పోలీసు బృందం ఆ ప్రాంతానికి చేరుకొని వివరాలు కనుగొన్నారు. అనంతరం పరారీలో ఉన్న కయెమ్‌ను పట్టుకుని, గట్టిగా ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. ‘‘ అవును నా భార్యను నేనే గురువారం రాత్రి హత్యచేశాను. తన శరీర భాగాలను రెండు సంచుల్లో పెట్టి, అడవిలో పడేశానని చెప్పాడు.’’ దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, బాలిక శరీర భాగాలు ఉన్న స్థలానికి వెళ్లి ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story