షాకింగ్ న్యూస్.. కొవిడ్ ఎఫెక్ట్‌తో తగ్గిన మానవుని ఆయుష్షు ?

by Jakkula Samataha |
షాకింగ్ న్యూస్.. కొవిడ్ ఎఫెక్ట్‌తో తగ్గిన మానవుని ఆయుష్షు ?
X

దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారి ఎన్నో జీవితాలను కుదిపేసింది. ఆనందంగా ఉండే కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.ఈ కొవిడ్ బారిన పడి కొంత మంది మరణిస్తే మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది గుండె పోటు వంటి సమస్యలతో చనిపోతున్నారు. రోజు రోజుకు హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య, వివిధ రకాల కారణాలతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో కొంత మంది కొవిడ్ కారణంగా గుండెపోటు అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పుకొస్తున్నారు. కరోనా,బలి తీసుకోవడమే కాదు, కొవిడ్ వచ్చిపోయిన వారిని కూడా వదలడం లేదంటూ చెప్పుకొస్తున్నారు.

ఇక ఇదంత పక్కన పెడితే ది లాన్సెట్ జర్నల్ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. గతంతో పొలిస్తే ప్రస్తుతం మనిషి ఆయుష్షు తగ్గినట్లు నిపుణులు తెలుపుతున్నారు. తాజా పరిశోధనలో కొవిడ్ కారణంగా ఒక మనిషి సగటు ఆయుర్దాయం 1.6కి తగ్గిదంట. 1950లో 49 ఏళ్లుగా ఉండగా, 2019లో 73 ఏళ్లకు పెరిగింది. కానీ 2019 – 2021 మధ్య ఇది ​​1.6 తగ్గింది.ఈ కాలంలో 15 ఏళ్లు పైబడిన వారి మరణాల రేటు పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం పెరిగిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2020, 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 131 మిలియన్ల మంది మరణించారని, వారిలో 16 మిలియన్ల మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారని వారు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ అధ్యయానాన్ని 2020-2021 సంవత్సరంలో నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed