2024 ‘సోషల్’ వార్‌కు బీజేపీ సన్నాహాలు.. దేశవ్యాప్తంగా ట్రైనింగ్ సెషన్స్

by Vinod kumar |
2024 ‘సోషల్’ వార్‌కు బీజేపీ సన్నాహాలు.. దేశవ్యాప్తంగా ట్రైనింగ్ సెషన్స్
X

న్యూఢిల్లీ : వచ్చే లోక్ సభ ఎన్నికల ప్రచారమే టార్గెట్‌గా బీజేపీ తమ ఐటీ సెల్, సోషల్ మీడియా టీమ్‌లను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ విభాగాల్లో పనిచేసే దాదాపు 10,000 మందికిపైగా వలంటీర్లకు మెగా ట్రైనింగ్ క్యాంప్‌లను నిర్వహించనుంది. బీజేపీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా (ఐటీ విస్తారక్) ఎంపిక చేసిన వారికి తొలుతగా ఆగస్టు 27న (ఆదివారం) శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కోసం 10 మందిని బీజేపీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా ఎంపిక చేశామని, వారికి కీలకమైన పది లోక్ సభ స్థానాల ప్రచార బాధ్యతలను అప్పగిస్తామని పేర్కొన్నాయి. ఇక అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ 500 మంది చొప్పున సోషల్ మీడియా వలంటీర్లకు బీజేపీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం అన్ని జిల్లాల స్థాయిలోనూ ఇదే విధమైన ట్రైనింగ్ సెషన్లను నిర్వహించనున్నారు. నమో యాప్, సరళ్ యాప్‌లను ఏవిధంగా ఉపయోగించాలనే దానిపైనా ఈ క్యాంపులలో శిక్షణ ఇస్తారు.

Advertisement

Next Story