- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
80,000 పోలీసులు ఉన్నా.. అమృతపాల్ ఎలా తప్పించుకున్నాడు: హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృత పాల్ సింగ్ తప్పించుకోవడంపై పంజాబ్ పోలీసులపై ఆ రాష్ట్ర హైకోర్టు మండిపడింది. ఖలిస్తానీ నేత అమృత్ పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు చేపట్టిన అపరేషన్ నివేదికను సమర్పించాలని మంగళవారం కోరింది. రాష్ట్రంలో 80వేలకు పైగా పోలీసులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అమృత్ పాల్ సింగ్ ఎలా తప్పించుకుంటారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమని కోర్టు పేర్కొంది.
అయితే శనివారం నుంచి అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు చేపట్టిన అపరేషన్‌లో అతడి మద్ధతుదారులను 120 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్‌గా పేర్కొంటున్న అమృత్‌పాల్ సింగ్ శనివారం సాయంత్రం చివరిసారిగా మోటార్ సైకిల్‌పై కనిపించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని ఏళ్లుగా సాయుధ మద్ధతుదారులతో సింగ్ యాక్టివ్‌గా ఉన్నారు.