Jobs Creation : వికసిత భారత్ కావాలంటే.. అవన్నీ జరగాల్సిందే : గీతా గోపీనాథ్

by Hajipasha |
Jobs Creation : వికసిత భారత్ కావాలంటే.. అవన్నీ జరగాల్సిందే : గీతా గోపీనాథ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘వికసిత భారత్’‌ సాకారం కావాలంటే దేశంలో ఉద్యోగ కల్పనను సాధ్యమైనంత మేర పెంచాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సూచించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘ఇతర డెవలపింగ్ దేశాలలో పన్ను ఆదాయం ప్రధానంగా ప్రత్యక్ష పన్నుల నుంచి వస్తోంది. కానీ భారత్‌లో ఎక్కువ భాగం పన్ను ఆదాయం ‘ఇన్‌కమ్ ట్యాక్స్’ లాంటి పరోక్ష పన్నుల నుంచే వస్తోంది. అందుకే పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ బేస్‌లను మరింత విస్తరించాలి. దీనివల్ల పన్ను ఆదాయం పెరుగుతుంది’’ అని గీతా గోపీనాథ్ సూచించారు.

‘‘కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గిస్తే మంచిది.. అయితే ఇదే సమయంలో కార్పొరేట్ కంపెనీలు ట్యాక్స్‌ను ఎగవేసే మార్గాలను పూర్తిగా మూసివేయాలి’’ అని ఆమె పేర్కొన్నారు. ఆయా కంపెనీలకు పన్ను మినహాయింపులను కూడా తగ్గించడం మంచిదన్నారు.మూలధన ఆదాయ పన్నులు, మూలధన రాబడి పన్నుల ద్వారా భారత పన్నుల సేకరణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చని గీతా గోపీనాథ్ తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు మరింత సరళతరం, పారదర్శకం కావాలంటే అధునాతన టెక్నాలజీని వినియోగించాలన్నారు. దేశ ప్రజల తలసరి ఆదాయాలను ప్రభుత్వం పెంచగలిగితేనే.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రస్తుతమున్న 7 శాతాన్ని దాటి మున్ముందుకు వెళ్లగలుగుతుందని విశ్లేషించారు.

Advertisement

Next Story

Most Viewed