- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Priyanka Gandhi: వయనాడ్ ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తారని ఎదురుచూస్తున్నా- ప్రియాంక గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. కాగా.. కాంగ్రెస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi) బరిలో నిలిచారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సమయంలో ప్రియాంక మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలో ప్రజలు తనకు ఒక ఛాన్స్ ఇస్తారని ఎదురు చూస్తున్నానని తెలిపారు. వారు తనపై చూపించిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేరళలోని వక్ఫ్ చట్టం, కొండ చరియలు విరిగిపడిన వయనాడ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సహాయం అందకపోవడం వంటి విషయాల గురించి రిపోర్టర్లు ప్రశ్నించారు. కాగా.. ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదంటూ ఆమె సమాధానమిచ్చారు.
వయనాడ్ స్థానం నుంచి..
వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ(Rahul Gandhi) విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.6 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా.. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలోనూ రాహుల్ గెలిచారు. దీంతో వయనాడ్ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. దీంతో, ఈ స్థానం నంచి తొలిసారిగా ప్రియాంగ బరిలో నిలిచారు. ఆమెను 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఇకపోతే, లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ప్రియాంక వయనాడ్‌లో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించి.. కీలకపాత్ర పోషించారు. కేరళలో పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ స్థానాలతోపాటు వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక బుధవారం జరగుతుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.