- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు తెలంగాణకు అమిత్ షా.. T- BJP ముఖ్య నేతలతో మీటింగ్!
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి తెలంగాణకు వస్తున్నారు. శనివారం ఉదయం 7:50 నుంచి 10:30 వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహంచే పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అకాడమీ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతి నెలకోసారి తెలంగాణ పర్యటిస్తారని చెప్పిన విషయం తెలిసిందే. కాగా ముఖ్య నేతల భేటీలో వారికి ఏయే అంశాలపై దిశానిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్య నేతలతో భేటీ అనంతరం మధ్యాహ్నం 1:25కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు.
ఇవి కూడా చదవండి : 11 వేల సభలకు పక్కా ప్లాన్ రెడీ.. అధికారమే లక్ష్యంగా T- BJP భారీ వ్యూహం!