హిందీ నటుడు దలిప్ తాహిల్‌కు 2 నెలల జైలు శిక్ష!

by srinivas |   ( Updated:2023-10-22 12:35:05.0  )
హిందీ నటుడు దలిప్ తాహిల్‌కు 2 నెలల జైలు శిక్ష!
X

ముంబై: హిందీ నటుడు దలిప్ తాహిల్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. 2018 నాటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 2 నెలల జైలు శిక్షతో పాటు రూ. 500 జరిమానా విధించింది. మద్యం మత్తులో తన కారును ఆటో రిక్షాను ఢీకొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మేజిస్ట్రేట్ కోర్టు వైద్యుడి నుంచి అందిన సాక్ష్యాల ఆధారంగా దలీప్‌ని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. అలాగే, గాయపడిన మహిళకు రూ. 5,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అయితే, ఈ నిర్ణయాన్ని తాను ముంబైలోని సెషన్స్ కోర్టులో సవాలు చేయబోతున్నానని, మెజిస్ట్రేట్ కోర్టు తనకు నెల రోజుల సమయం ఇచ్చిందని దలీప్ తాహిల్ చెప్పారు. 'తాను న్యాయమూర్తి, మెజిస్ట్రేట్ కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ, తీర్పును సవాలు చేయాలని అనుకుంటున్నాను. జరిగిన ఘటనలో మహిళకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. తాను ఎవరినీ గాయపరచలేదని' అన్నారు.

నటుడు దలీప్ 2018లో ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఆటోరిక్షాను ఢీకొట్టి ఒక మహిళను గాయపరిచిన సమయంలో మద్యం తాగి కారు నడిపారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత, పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ గణేష్ నిమజ్జన ఊరేగింపుల వల్ల ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ప్రయాణీకులు దలీప్ కారును పట్టుకుని అతనితో ఘర్షణ పడ్డారు. వాగ్వాదానికి దిగి వారిని తోసేసినట్లు సమాచారం. అనంతరం పోలీసులు సమన్లు ఇచ్చి డలీప్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed