Hindenburg: మారిషడ్ ఫండ్లు ఆమె దగ్గరే ఉన్నాయి

by Shamantha N |
Hindenburg: మారిషడ్ ఫండ్లు ఆమె దగ్గరే ఉన్నాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: సెబీ చీఫ్ పై మరోసారి అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ విరుచుకుపడింది. హిండెన్ బర్గ్ ఆరోపణలను ఖండిస్తూ సెబీ చీఫ్‌ మాధబి బచ్‌ చేసిన ప్రకటన చేశారు. అయితే, ఆమె ప్రకటన మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించింది. మాధబి స్పందనలో ఆమెకు మారిషస్‌ ఫండ్లు ఉన్నాయనే విషయం తెలుస్తోందంది. అంతే కాకుండా ఆ ఫండ్స్ ని మాధవి భర్త ధవల్ స్నేహితుడు నిర్వహిస్తున్నాడని ఆరోపించింది. ధవల్ ఫ్రెండ్ అదానీ గ్రూపులో డైరెక్టర్ గా ఉన్నాడని తెలిపింది.

మరోసారి మాదభిపై ఆరోపణలు

అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పగించారని హిండెన్ బర్గ్ గుర్తుచేసింది. అయితే, వాటిల్లో మాధబి వ్యక్తిగత పెట్టబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని పేర్కొంది. సెబీ చీఫ్ గా నియామకం అయిన వెంటనే ఆమె 2017లో స్థాపించిన కంపెనీలు కనుమరుగయ్యాయని పేర్కొంది. 2019లో ఆమె భర్త ఆ కంపెనీల బాధ్యతలు స్వీకరించాలని తెలిపింది. ఆ కంపెనీ ఇప్పటికీ మాధబి సొంత కంపెనీగా ఉందని పేర్కొంది. దాని ద్వారా మాధబి కన్సల్టెంగ్‌ రెవెన్యూ సంపాదిస్తోదని తెలిపింది. ఇకపోతే, సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు మారిషస్ ఫండ్ లలో మాధబి, ఆమె భర్త వాటాలు తీసుకురున్నారని ఆరోపించింది. అయితే, మాదభి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ ఆరోపణలు నిరాధారమైననవని, ఎలాంటి నిజాలు లేవని ప్రకటించారు. దీనిపైనే మరోసారి హిండెన్ బర్గ్ వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Next Story