- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్‌ను రావణుడితో పోల్చిన అసోం సీఎం.. ఏమన్నారంటే..
దిశ, నేషనల్ బ్యూరో: రాహుల్ గాంధీని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ నేతలను రావణుడితో పోల్చారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాహుల్‌ను ఎందుకు ఆహ్వానించలేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా హిమంత బిశ్వ శర్మ ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఈ రోజైనా రావణుడి గురించి మాట్లాడనివ్వకండి’’ అని కామెంట్ చేశారు. ‘‘మీరు రావణుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?’’ అని సీఎం హిమంత మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ‘‘ఈ ఒక్క రోజైనా రాముడి గురించి మాట్లాడండి. 500 ఏళ్ల తర్వాత ఇవాళ అయినా రాముడి గురించి మంచి మాట్లాడాలి. ఈ ఒక్క రోజైనా మమ్మల్ని రావణుడి గురించి మాట్లాడనివ్వకండి’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. అయితే వీటిని తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం బీజేపీ/ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలా ఉందని విమర్శించింది. అందుకే ఈ వేడులకు వెళ్లడం లేదని చెప్పింది. దీనిపైనే ఇప్పుడు బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ ప్రస్తుతం అస్సాంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం హిమంత, రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అస్సాంలోని పవిత్ర బటద్రవా ధామ్ వెళ్లాలని రాహుల్ గాంధీ భావించినప్పటికీ.. భద్రత కారణాల దృష్ట్యా అసోం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.