Kangra Airport: కస్టమర్ సంతృప్తి సర్వేలో రెండో స్థానం

by Shamantha N |
Kangra Airport: కస్టమర్ సంతృప్తి సర్వేలో రెండో స్థానం
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని కాంగ్రా విమానాశ్రయానికి(Kangra Airport) అరుదైన ఘనత దక్కింది. కస్టమర్ సంతృప్తి సర్వేలో(Customer Satisfaction Survey) రెండో స్థానంలో కాంగ్రా ఎయిర్ పోర్టు నిలిచింది. దీంతో ఆ ఎయిర్ పోర్టుకు అవార్డు లభించింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI).. దేశంలోని 61 విమానాశ్రయాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వే చేపట్టింది. వీటికి సంబంధించిన ర్యాంకులను ఏఏఐ బుధవారం విడుదల చేసింది.

తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి విమానాశ్రయం(Rajamundry Airport) తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత, లేహ్(Leh), మధురై విమానాశ్రయాలు(Madurai ) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ర్యాంకింగ్స్ వల్ల మరింత నాణ్యమైన కస్టమర్ సర్వీసులు ఇచ్చే అకాశం ఉంటుందని ఏఏఐ తెలిపింది. గతేడాది ప్రథమార్థంలో నిర్వహించిన సర్వేలో కాంగ్రా విమానాశ్రయం 11వ స్థానంలో ఉంది. భవిష్యత్ లో తమ ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందిస్తామని కాంగ్రా ఎయిర్ పోర్టు డైరెక్టర్ ధీరేంద్ర సింగ్ హామీ ఇచ్చారు.

ఏడాదికి రెండుసార్లు

కస్టమర్ సంతృప్తి సర్వే ఏడాదికి రెండుసార్లు జరుగుతోంది. జనవరి నుంచి జూన్ వరకు, జూన్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. సర్వేలో భాగంగా విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. పార్కింగ్ సదుపాయాలు, బ్యాగేజీ ట్రాలీల లభ్యత, పార్కింగ్ సౌకర్యాలు, సిబ్బంది ప్రవర్తన, పరిశుభ్రత, భోజన సదుపాయాలు, విమాన సమాచార డిస్‌ప్లే స్క్రీన్‌లు, టెర్మినల్‌లో నడిచే దూరం, ఎయిర్‌పోర్టు వాతావరణం సహా పలు అంశాలపై ఈ సర్వేలో ప్రశ్నలు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed