Himachal pradesh: హిమాచల్‌లో భారీ వర్షాలు..14 రోడ్లు మూసివేత

by vinod kumar |
Himachal pradesh: హిమాచల్‌లో భారీ వర్షాలు..14 రోడ్లు మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో అధికారులు 14రోడ్లను మూసి వేశారు. మండి జిల్లాలో అధికంగా11 రోడ్లు, కిన్నౌర్‌లో రెండు, కాంగ్రాలో ఒక రోడ్డును నిలిపివేశారు. కిన్నౌర్ జిల్లాలోని నిగుల్‌సరి వద్ద కొండచరియలు విరిగిపడటంతో రహదారి క్లోజ్ అవగా.. సోమవారం ఉదయం వరకు తిరిగి ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక వాతావరణ శాఖ ఈ నెల 26వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో కాంగ్రా, మండి, చంబా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, జూన్ 27 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న వర్షాల వల్ల రాష్ట్రంలో సుమారు 333 కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. విశిధ ఘటనల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed