- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిమాచల్‌ప్రదేశ్ సంక్షోభం: ఉత్తరాఖండ్‌కు 11 మంది ఎమ్మెల్యేలు!
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలతో హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఆరుగురు ఎమ్మెల్యేలతో సహా మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. రిశికేష్‌లోని తాజ్ హోటల్‌లో వీరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీఎం సుఖ్వింధర్ సుఖు ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్‌లో క్యాంపు నిర్వహించడం గమనార్హం. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్ ఎందుకు వెళ్లారు అనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ పరిణామాలతో కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి.
గత నెల రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మను సింఘ్వీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చెతన్య శర్మ దేవిందర్ కుమార్ భుట్టోలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హోషియార్ సింగ్, కెఎల్ ఠాకూర్, ఆశిష్ శర్మ కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు కూడా ఉత్తరాఖండ్ చేరుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా స్పందిచలేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఎందుకు క్యాంపు ఏర్పాటు చేశారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా, 68 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది ఉన్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
సీఎం మార్పు ఉండనుందా?
ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం సుఖూ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడానికి కూడా సీఎం ప్రవర్తనా తీరే కారణమని వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్‌లను హిమాచల్‌కు పంపారు. వీరు ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. అయితే ఈ భేటీలోనూ సీఎంని మార్చాలని డిమాండ్ చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం సీఎంను మార్చనుందా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం సుఖు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.