హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రికి అస్వస్థత!

by Nagaya |
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రికి అస్వస్థత!
X

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అస్వస్థకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతూ ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి తర్వాత ఆయన తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కడుపులో ఇన్‌ఫెక్షన్ వల్లనే ఆయన అస్వస్థకు గురయ్యారని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు చెప్పారు. ముఖ్యమంత్రిని అన్ని రకాల పరీక్షలు నిర్వహించామని, ఆల్ట్రా సౌండ్ రిపోర్ట్‌లలో నార్మల్‌గానే ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అబ్జర్వేషన్‌లో ఉంచామన్నారు. పరీక్షలు కొనసాగుతున్నందున ముఖ్యమంత్రి ఆసుపత్రిలోనే ఉంటారని వైద్యులు పేర్కొన్నారు.

Advertisement

Next Story