హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ

by GSrikanth |   ( Updated:2022-10-13 05:25:47.0  )
హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: హిజాబ్ వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉడిపిలోని ప్రీ యూనివర్శిటీ కళాశాలల్లో చదువుతున్న ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కును కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ మార్చి 15న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు పరిశీలించింది. కేసులో ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జడ్జి హేమంత్ గుప్తా కర్నాటక హైకోర్టును తీర్పును సమర్థించగా.. మరో జడ్జి సుధాన్షు ధులియా కర్నాటక హైకోర్టు తీర్పును తోసిపుచ్చారు. దీంతో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, గతంలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విస్తృతమైన వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు సెప్టెంబర్ 22న ఈ విషయంలో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story