ఏడు నెలల తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా పెరుగుదల..

by Mahesh |   ( Updated:2023-04-12 05:32:25.0  )
ఏడు నెలల తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా పెరుగుదల..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పెరుగుదల గత వారం రోజులుగా విపరీతంగా ఉంది. రోజు రోజుకు పాజిటివ్ రేటు పెరుగుదల నమోదవుతూనే ఉంది. తాజాగా మరో 7,830 కొత్త COVID-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని ప్రకారం ఈ పెరుగుదల గడిచిన 7 నెలల్లో ఇదే అత్యధికం గా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,04,771కి చేరుకుంది. అలాగే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,31,016కు పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది.

Read more:

బీ అలర్ట్ : దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

Advertisement

Next Story