Supreme Court: ఎఫ్ఐఆర్ మరో రాష్ట్రంలో ఉన్నా.. ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చు

by srinivas |
Supreme Court: ఎఫ్ఐఆర్ మరో రాష్ట్రంలో ఉన్నా.. ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చు
X

న్యూఢిల్లీ: కేసు ఒక రాష్ట్రంలో ఉంటే.. ముందస్తు బెయిల్ కోసం మరో రాష్ట్రంలో దాఖలయ్యే పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలకమైన తీర్పు ఇచ్చింది. మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో.. అతడికి రక్షణ కల్పించడం అత్యవసరమని భావిస్తేనే దాన్ని మంజూరు చేయొచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పౌరుడి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవాలను పరిరక్షించేందుకు ఈవిధంగా హైకోర్టులు, సెషన్స్ కోర్టులు ముందస్తు బెయిల్‌లను ఇవ్వొచ్చని సూచించింది. సీఆర్పీసీలోని సెక్షన్ 438 ప్రకారం పిటిషనర్ రక్షణ కోసం పరిమిత ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయొచ్చని తెలిపింది. అయితే పనికట్టుకొని బెయిల్ కోసమే రాష్ట్రం దాటి వచ్చే వారిని పసిగట్టి, పిిటిషన్‌ను తిరస్కరించడం అత్యవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పిటిషనర్ల రక్షణ కోసం మాత్రమే ఈవిధమైన ముందస్తు బెయిల్‌లను మంజూరు చేయాలని హైకోర్టులు, సెషన్స్ కోర్టులకు నిర్దేశించింది. ప్రియా ఇండోరియా వర్సెస్ కర్ణాటక రాష్ట్రం మధ్య నడిచిన వరకట్నం కేసు విచారణ సందర్భంగా ఈమేరకు 85 పేజీల తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed