19 అంతస్తుల్లో.. భారీ హోటల్ నిర్మించనున్న సల్మాన్ ఖాన్

by Mahesh |
19 అంతస్తుల్లో.. భారీ హోటల్ నిర్మించనున్న సల్మాన్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు హీరోగా రాణిస్తునే.. బిజినెస్ రంగంలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబైలో సముద్రానికి ఎదురుగా తనకున్న భూమిలో 19 అంతస్తుల భారీ హోటల్‌ను నిర్మించాడానికి చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకుగాను సల్మాన్ ఖాన్ ఫ్యామిలి ఆర్కిటెక్ట్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు సమర్పించిన ప్రణాళిక ప్రకారం.. హోటల్‌లో కేఫ్, రెస్టారెంట్, వ్యాయామశాల, స్విమ్మింగ్ పూల్ ఉండనున్నాయి.

అలాగే 7 నుంచి 19వ అంతస్తులలో హోటల్‌కు సంబంధించిన గడులు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ప్రణాళికను.. సల్మాన్ ఖాన్ ఆర్కిటెక్ట్.. ముంబైలోని బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ హోటల్‌ను నిర్మించే ప్రణాళికలను సమర్పించగా దీనికి మున్సిపల్ అధికారులు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. అలాగే ఆ భారీ హోటల్ కు సంబంధించిన పనులు అతి త్వరలో ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed