Ayodhya: ఇకపై హైదరాబాద్ - అయోధ్య మధ్య డైరెక్ట్ ఫ్లైట్

by Shiva |   ( Updated:2024-03-31 11:45:07.0  )
Ayodhya: ఇకపై హైదరాబాద్ - అయోధ్య మధ్య డైరెక్ట్ ఫ్లైట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అయోధ్య శ్రీరామచంద్రుడి దర్శనార్థం వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానయాన సర్వీసు ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి ఈ సర్వీసు ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి లేఖ రాసినట్లు తెలిపారు. కాగా, ఆయన వెంటనే స్పందించి.. రెండు నగరాల మధ్య విమానాల రాకపోకల కోసం వాణిజ్య విమాన సంస్థలతో (కమర్షియల్ ఎయిర్‌లైన్స్)తో మాట్లాడి హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడు రోజుల చొప్పున మంగళవారం, గురువారం, శనివారం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed