- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్
దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జార్ఖండ్ హైకోర్టు తన పిటిషన్‌పై ఫిబ్రవరిలోనే విచారణ పూర్తి చేసినప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హేమంత్ సోరెన్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కపిల్ సిబల్ వాదనలు వినిపించగా, ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్‌కు తెలియజేయాలని కోరారు. దీన్ని ఏప్రిల్ 26న విచారించాలని కపిల్ సిబల్ కోర్టును కోరగా, జస్టిస్ ఖన్నా, 'తాను ఏమీ చెప్పడం లేదు. ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ తేదీని తెలియజేస్తార 'ని పేర్కొన్నారు. కాగా, భూ కుంభకోణం ఏసులో హేమంత్ సోరెన్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణల్తో ఈ ఏడాది జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్‌పై స్పందించడానికి ఈడీకి మరో వారం ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వ్యవహారాన్ని రాజకీయ ప్రేరేపితమని, బీజేపీలో చేరేందుకు చేసిన కుట్రలో భాగమని హేమంత్ సోరేన్ ఆరోపణలు చేస్తున్నారు.