Helicopter Crashes: ఎంఐ-17 నుంచి జారి నదిలో పడిన మరో హెలికాప్టర్‌

by Shamantha N |
Helicopter Crashes: ఎంఐ-17 నుంచి జారి నదిలో పడిన మరో హెలికాప్టర్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎంఐ- 17 చాపర్ నుండి మరో హెలికాప్టర్ జారి పడింది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్‌లో ల్యాండింగ్ సమయంలో ఎంఐ- 17 నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తుండగా క్రిస్టల్ హెలికాప్టర్ జారి పడినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కేదార్‌నాథ్‌ సమీపంలోని భీంబాలి సమీపంలో క్రెస్టల్ హెలికాప్టర్ మరమ్మతులకు గురైంది. దానిని ఎంఐ-17తో తరలిస్తుండగా తీగ తెగి మందాకిని నదిలో కుప్పకూలింది. అయితే, విమానం ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనేది వెంటనే తెలియరాలేదు.

గౌరీకుండ్ దగ్గరచిక్కుకున్న యాత్రికులు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రకు తీవ్ర అంతరాయం జరిగింది. ట్రెక్ మార్గాన్ని మూసివేసినప్పటికీ యాత్రికులు హెలికాప్టర్లలో ఆలయానికి చేరుకున్నారు. అయితే, గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ప్రైవేట్ హెలికాప్టర్‌లతో పాటు వైమానిక దళానికి చెందిన చినూక్, MI-17 హెలికాప్టర్ల సహాయంతో భారీ రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ ఘటన జరిగింది. అయితే, గతంలో దెబ్బతిన్న క్రిస్టల్ హెలికాప్టర్ నే ఈ ఆపరేషన్ లో వాడారు.

Advertisement

Next Story

Most Viewed