ఆ వయసులోను కొడుకు కోసం హీరాబెన్ ప్రచారం..

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-30 03:18:40.0  )
ఆ వయసులోను కొడుకు కోసం హీరాబెన్ ప్రచారం..
X

దిశ, వెబ్ డెస్క్: మోడీ తల్లి హీరాబెన్ వృద్ధాప్యంలోనూ యాక్టివ్‌గా ఉండేవారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు, ప్రధాని మోడీకి ఓటు వేయాలని ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు. అప్పటికి ఆమె వయసు 98. ఆ వయసులోను మోడీ తరుపున విస్తృతంగా ప్రచారం చేశారు. 2016 నవంబర్‌లో పాత కరెన్సీ నోట్లను బ్యాన్ చేయడం(డిమానిటైజేషన్)కు మద్దతుగా ఆమె ఏటీఎం వద్ద క్యూలో నిలబడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హీరాబెన్ రేసన్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని మోడీ తన ప్రతి పుట్టినరోజుకు తల్లి ఆశీర్వాదం తీసుకునేవారు. ఏ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తప్పకుండా తల్లి పాదాల వద్ద మోడీ ఆశీర్వాదాలు తీసుకునే వారు.

Also Read...

హీరాబెన్ మృతికి ప్రముఖుల సంతాపం

Advertisement

Next Story