కేజ్రీవాల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ..తీర్పు రిజర్వ్

by vinod kumar |
కేజ్రీవాల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ..తీర్పు రిజర్వ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు. కేజ్రీవాల్‌ ఇప్పటికే జైలులో ఉన్నారని, అక్కడే విచారించి ఉండాల్సిందని తెలిపారు. కేజ్రీవాల్ బయటకు రావాలనే ఉద్దేశం లేదని అందుకే మరో కేసులో సీబీఐ అరెస్టు చేసిందని చెప్పారు. కనీసం నోటీసు కూడా పంపకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అలాగే సీబీఐ తరఫున న్యాయవాది డీపీ సింగ్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తీర్పు రాసేందుకు 5 నుంచి 7రోజుల సమయం పడుతుందని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తెలిపారు. అలాగే కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై జూలై 29న విచారణ జరగనుంది.

అంతకుముందు కేజ్రీవాల్ తరఫున వాదించిన మను సింఘ్వి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది దురదృష్టవశాత్తు ఇన్సునెన్స్ అరెస్ట్ లాంటిదని అభివర్ణించారు. ఈడీ కేసులో మూడు ఉత్తర్వులు కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్డర్స్ కేజ్రీవాల్ విడుదల చేయడానికి అర్హుడని స్పష్టం చేస్తున్నాయని, అయినప్పటికీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ తీవ్రవాది కాదని పేర్కొన్న సింఘ్వీ..చట్టం ప్రకారం ఆయనను అరెస్టు చేయలేదని, బెయిల్‌ పొందేందుకు అన్ని విధాలా అర్హులని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed