- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video : ఏంటి బ్రో.. ఇంత టాలెంటెడ్‌లా ఉన్నావ్! దాండియా వేడుకల్లో యువకుడు ఆ పని!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో దుర్గామాత అలయాలు, మండపాల వద్ద యువతి, యువకులు పెద్ద ఎత్తున గర్భా, దాండియా, కోలాటం ఆడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్నేహ, భక్తి పూరిత వాతావరణంలో ఆడుతున్న దాండియాను ఎందరో ప్రత్యక్షంగా, సోషల్ మీడియా వేదికల ద్వారా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు దాండియా వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ చదువుతున్నాడు. స్టెప్స్ ఎక్కడ మిస్ కాకుండా పుస్తకం చదువుతూ డ్యాన్స్ ఇరగదీశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి బ్రో.. ఇంత టాలెంటెడ్‌లా ఉన్నావ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఏమో అందుకే డ్యాన్స్ చేస్తూ కూడా చదువు మాత్రం మానటం లేదని పలువురు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
కాగా, దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్తరాధిన ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో కోలాటం, గర్భా, దాండియా ఎంతో ఫేమస్. ముఖ్యంగా గుజరాత్‌లో, రాజస్థాన్‌లో అత్యంత ప్రజాధరణ పొందిన జానపద నృత్యాలలో ఈ దాండియా ఒకటి. మన తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల దాండియా ఆడతారు.