ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు.. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

by Y.Nagarani |   ( Updated:2024-10-09 10:24:46.0  )
ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు.. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా.. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. చంద్రబాబు తలకు పరివేష్టం స్థానాచార్యులు శివప్రసాద్ వర్మ పరివేష్టం చుట్టగా.. తలపై పట్టువస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలను మంగళవాయిద్యాలతో తీసుకెళ్లారు. సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ లు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి, దర్శనం చేసుకున్నారు. సీఎం ఆలయానికి వచ్చినా.. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా.. జరుగుతున్నాయి. నేడు మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్థరాత్రి నుంచి అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిస్తుండగా.. విజయవాడకు భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులను కంట్రోల్ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. అమ్మ దర్శనానికి వదలాలంటూ కొండకింద రోడ్డుపై పోలీసులతో భక్తులు వాదనకు దిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన రద్దీని చూసి పోలీసులు షాకయ్యారు.

Advertisement

Next Story