Sai Pallavi: అదృష్టం ఉంటేనే ఇలాంటి పాత్రలు వస్తాయి.. సాయి పల్లవి క్రేజీ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-09 08:58:38.0  )
Sai Pallavi: అదృష్టం ఉంటేనే ఇలాంటి పాత్రలు వస్తాయి.. సాయి పల్లవి క్రేజీ కామెంట్స్
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వరుణ్ తేజ్ ‘ఫిదా’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత నాని, శర్వానంద్, రానా దగ్గుబాటి రానా, నాగచైతన్య వంటి వారితో నటించి వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి యూత్‌లో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగులో అక్కినేని హీరో నాగచైతన్య ‘తండేల్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ‘అమరన్’లో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‌తో జత కట్టనుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి క్రేజీ కామెంట్స్ చేసింది. ‘‘నా ముందుకు అమరన్ స్క్రిప్ట్ వచ్చింది. అది చదివిన తర్వాత నాకు ఎన్నో సందేహాలు వచ్చాయి. కమర్షియల్ సినిమాలు పెద్ద హీరోలతో కలిసి చేస్తే చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి స్క్రిప్ట్‌లో కొన్ని సన్నివేశాలు కట్ చేస్తారని భావించాను. ఈ విషయాన్ని డైరెక్టర్‌కు కూడా చెప్పాను. అతనితో చర్చించాను.. దానిపై నాకు క్లారిటీ వచ్చాకే అమరన్‌లోని పాత్రను వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను.

ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి పాత్రలో నటించే అవకాశం రాదు’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఇందులో సాయిపల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య రెబెకా వర్గీస్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ‘అమరన్’ నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కాబోతున్నట్లు సమాచారం.


👉 Also Read: Sai Pallavi: షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసిన సాయిపల్లవి.. షాకింగ్‌లో నెటిజన్లు..!!

Advertisement

Next Story

Most Viewed