సీబీఐ చేతికి ఢిల్లీ కోచింగ్ సెంటర్ మృతుల కేసు

by M.Rajitha |
సీబీఐ చేతికి ఢిల్లీ కోచింగ్ సెంటర్ మృతుల కేసు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఢిల్లీలో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాద ఘటన కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, అలాగే అధికారుల పాత్రపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని, దర్యాప్తుపై పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కోర్టు తెలిపింది. ఈ మొత్తం దర్యాప్తుపై పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ను ఆదేశించింది. కేసు వాదన సందర్భంగా ఢిల్లీ మున్సిపల్ అధికారులు, పోలీసులు చెప్పిన సమాధానాలపై మండిపడిన ధర్మాసనం, ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో కారు డ్రైవర్ ను అరెస్ట్ చేయడం పట్ల కూడా పోలీసులకు చీవాట్లు పెట్టింది. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని పట్ల సివిల్స్ అభ్యర్థులు స్వాగతించారు. ఈ దర్యాప్తుతో అయినా వాస్తవాలు బయటకు రావాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed