120 మంది మహిళలను రేప్‌ చేసిన జిలేబీ బాబా మృతి

by Dishanational4 |
120 మంది మహిళలను రేప్‌ చేసిన జిలేబీ బాబా మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో : 120 మందికిపైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద ‘జిలేబీ బాబా’ మరణించాడు. ఎంతోమంది మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలను తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన కేసులో 14 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న జిలేబీ బాబా జైలులోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఇతడు హర్యానాలోని హిసార్‌లో ఉ్న సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. డయాబెటిక్ పేషంట్ అయిన బాబా ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటు వచ్చిందని అతడి తరఫు న్యాయవాది వెల్లడించాడు. మంగళవారం రాత్రి జిలేబీ బాబా ఇబ్బందిగా ఉందని చెప్పిన వెంటనే.. జైలు అధికారులు అతడిని హాస్పిటల్‌కు తరలించారని, అయితే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారని ఎస్సై భూప్ సింగ్ తెలిపారు. బుధవారం పోస్ట్ మార్టం అనంతరం బిల్లు రామ్ అంత్యక్రియలు నిర్వహించారు. జిలేబీ బాబాకు బిల్లూరామ్, అమర్‌పురి అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. 2018లో ఓ రేప్ కేసులో జిలేబీ బాబా అరెస్టయిన తర్వాత అతని అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రబుద్దుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి ఫోనులో 120 సెక్స్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. తన వద్దకు భూత వైద్యానికి వచ్చిన చాలా మంది మహిళలను జిలేబీ బాబా బలవంతం చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. 2017లోనే ఇతన్ని లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయగా, బెయిల్‌పై బయటికి వచ్చాడు. మొత్తానికి చేసిన పాపాలు పండి జైలుకు వెళ్లిన దొంగ బాబా శిక్ష పూర్తికాక ముందే మరణించాడు.

Next Story

Most Viewed