Haryana elections: హర్యానా ఎన్నికల తేదీని వాయిదా వేయాలి.. ఈసీకి బీజేపీ విజ్ఞప్తి

by vinod kumar |
Haryana elections: హర్యానా ఎన్నికల తేదీని వాయిదా వేయాలి.. ఈసీకి బీజేపీ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: అక్టోబరు 1న జరగాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర యూనిట్ శనివారం ఈసీకి లేఖ రాసింది. హర్యానా ఎన్నికల ప్రధాన అధికారి పంకజ్ అగర్వాల్‌కు ఈ లేఖను మెయిల్ ద్వారా పంపించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత వరీందర్ గార్గ్ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల తేదీకి ముందు వారాంతంలో సెలవు ఉన్నాయి. ఆ తరువాత కొన్ని హాలీడేస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ప్రయాణానికే ఎక్కవ ఆసక్తి చూపుతారు. దీని వల్ల ఓటింగ్ శాతం తగ్గే చాన్స్ ఉంది. ఇది పోలింగ్ శాతాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని తెలిపారు.

మెరుగైన పోలింగ్ నమోదు కావాలంటే సెలవులు ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 28 శనివారం చాలా మందికి సెలవు, ఆదివారం సెలవు. అక్టోబర్1న రాష్ట్రంలో ఎన్నికల హాలిడే, 2న గాంధీ జయంతి, 3న మహారాజా అగ్రసేన్ జయంతి సెలవు అని చెప్పారు. సెలవులు ముగిసిన అనంతరం కొత్త ఎన్నికల తేదీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అక్టోబరు 1న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, అక్టోబర్ 4న ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఆగస్టు 16న ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed