మనీలాండరింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..9 రోజుల రిమాండ్

by vinod kumar |
మనీలాండరింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..9 రోజుల రిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ కేసులో హర్యానాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్‌ను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం అరెస్టు చేసింది. గురుగ్రామ్‌లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని యమునానగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించినప్పటికీ దానిని ఉల్లంఘించి మైనింగ్ నిర్వహించారు. దీనిపై హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా..ఈడీ విచారణ జరుపుతోంది. దీంతో ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్యే ప్రాంగణాల్లో ఈడీ దాడులు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా పన్వార్‌ను అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయనను అంబాలాలోని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టులో హాజరుపర్చగా 9రోజుల రిమాండ్ విధించింది. దీంతో పన్వార్ జూలై 29వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కాగా, ఈ ఏడాది చివర్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story