US Presidential Elections: భవిష్యత్ నిర్మాణం, దేశ దిరోగమనానికి మధ్య ఎన్నికలు

by Shamantha N |
US Presidential Elections: భవిష్యత్ నిర్మాణం, దేశ దిరోగమనానికి మధ్య ఎన్నికలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా(America) అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి (Democratic Party), ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(Kamala Harris) అన్నారు. ప్రచారంలో తాను వెనకబడ్డానని గుర్తుచేశారు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా తన పేరు అధికారికంగా ప్రకటించాక.. శనివారం తొలి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికలు భవిష్యత్ నిర్మాణం, దేశ తిరోగమనం అనే రెండింటి మధ్య జరుగుతుందని కమలా హ్యారిస్ అన్నారు. ప్రస్తుతానికి వెనకబడ్డట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. క్రమంగా పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమకు ప్రజల మద్దతు ఉందని.. తమది ప్రజాపోరాటం అని తెలిపారు. ఇకపోతే, శనివారం ఆమె 1.4 మిలియన్‌ డాలర్ల విరాళాలను సేకరించారు.

ట్రంప్ పై విమర్శలు

పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు కావాల్సిన ప్రతినిధుల మద్దతు సంపాదించానని కమలా హారిస్‌ ప్రకటించారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పై, ఆయన విధానాలపై విమర్శలు గుప్పించారు. మనం ఎలాంటి దేశంలో జీవించాలనుకుంటున్నాం? అని ప్రశ్నించారు. స్వేచ్ఛ, పట్టుదల, చట్టబద్ధమైన పాలన ఉన్నచోటా? గందరగోళం, భయం, ద్వేషం ఉన్నచోటా? అని ప్రజలను ప్రశ్నించారు. తనతో చర్చకు ట్రంప్‌ (Donald Trump) అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తానో న్యాయవాది అని.. వృత్తిలో భాగంగా ఎంతోమంది నేరస్థులను చూశానన్నారు. మహిళలపై దుర్భాషలాడిన, వినియోగదారులను మోసగించిన, స్వప్రయోజనాల కోసం నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని ఇలా.. అందర్ని చూశానన్నారు. వీరిలో ట్రంప్ ఏ రకానికి చెందినవారో తనకు తెలుసని ఎద్దేవా చేశారు. తనపై ట్రంప్ చేస్తున్న ఆరోపణలు అన్నీ అసత్యాలే అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed