మోడీని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుకు వేధింపులు.. వైట్ హౌస్ రియాక్షన్ ఇదే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-27 07:59:10.0  )
మోడీని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుకు వేధింపులు.. వైట్ హౌస్ రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ (డబ్ల్యూఎస్‌జె) మహిళా జర్నలిస్టు సబ్రినా సిద్దిఖీని వేధింపులకు గురిచేయడాన్ని వైట్ హౌస్ ఖండించింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని బదులిచ్చింది. పాత్రికేయులకు వేధింపులు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఈ తరహా చర్యలను ఖండిస్తున్నట్లు వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించారు. జూన్ 23న వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో సబ్రినా సిద్ధిఖీ భారత్‌లో మైనార్టీ హక్కులపై నరేంద్ర మోడీని ప్రశ్నించింది.

దీంతో సోషల్ మీడియాలో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొందరూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తన సహోద్యోగి సబ్రినా సిద్ధిఖీ వేధింపులకు గురవుతున్నారని దీనిపై వైట్ హౌస్ స్పందన ఏమిటని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన జర్నలిస్టు ఒకరు వైట్ హౌస్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ ల సమన్వయకర్త జాన్ కిర్బీ.. పాత్రికేయులు ఎలాంటి పరిస్థితుల్లో వేధింపులకు గురైన వైట్ హౌస్ ఖండిస్తుందని బదులిచ్చారు.

Read more : భారత్- అమెరికా ఒప్పందాలపై చైనా అక్కసు

ఒకే రోజు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

Advertisement

Next Story

Most Viewed