- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hamas: పీవోకేలో హమాస్ నేతలకు వీఐపీ వెల్‌కమ్.. బైక్ ర్యాలీ చేపట్టిన జైషే టెర్రరిస్టులు

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pok)లో ఏర్పాటు చేసిన భారత వ్యతిరేక సమావేశానికి హమాస్(Hamas) ఉగ్రవాదులు హాజరుకావడం సంచలనంగా మారింది. అంతేగాక పీఓకేకు వచ్చిన హమాస్ ప్రతినిధులకు జైష్- ఏ-మహమ్మద్ (Jaish terrorists) , లష్కరే తోయిబా (Lashkar-e-Taiba ) ఉగ్రవాదులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. వారిని వీఐపీలుగా ట్రీట్ చేసి ఆహ్వానం పలికారు. హమాస్ టెర్రిరిస్టుల చుట్టూ గుమిగూడిన జైషే, లష్కర్ ఉగ్రవాదులు బైక్‌లు, గుర్రాలపై పీఓకేలో ర్యాలీ నిర్వహించారు. హమాస్ జెండాలు చేతబూని నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, పాకిస్థాన్ ఈ నెల 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో హమాస్ నాయకులు, జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ సందర్భంగానే హమాస్‌కు ఘన స్వాగతం పలికినట్టు తెలుస్తోంది. రావల్‌కోట్‌లోని షహీద్ సబీర్ స్టేడియంలో సమావేశం జరిగిన ఈ కార్యక్రమానికి జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్, జైష్ కమాండర్ అస్గర్ ఖాన్ కశ్మీరీతో సహా పలువురు ఉగ్ర నేతలు హాజరైనట్టు సమాచారం.