- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ వేసవి చాలా హాట్ గురూ..!
దిశ, వెబ్ డెస్క్: ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి మరో మూడు నెలల వరకూ దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వివరాలను వెల్లడించారు.
బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ, వాయువ్య దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా అనేక చోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.