ఓబీసీ రిజర్వేషన్లు 27శాతానికి పెంపు..

by Vinod kumar |
ఓబీసీ రిజర్వేషన్లు 27శాతానికి పెంపు..
X

అహ్మదాబాద్: పంచాయతీ, అర్బన్ లోకల్ బాడీస్‌లో ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) రిజర్వేషన్‌ను 10శాతం నుంచి 27శాతానికి పెంచుతున్నట్టు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో 52శాతంగా ఉన్న ఓబీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీలకు రిజర్వేషన్లను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9న ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేఎస్ ఝవేరిని నియమించింది.

మరోవైపు, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న కాంగ్రెస్ గాంధీనగర్‌లో ఇక రోజంతా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే కేఎస్ ఝవేరీ సూచన మేరకు గుజరాత్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పెంపు ప్రకటనతో రాష్ట్రంలోని 7000 గ్రామ పంచాయతీలు, రెండు జిల్లా పంచాయతీలు, 70 మున్సిపాలిటీలకు ఎన్నికలకు మార్గం సుగమం కానుంది.

Advertisement

Next Story