బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ తీర్మానం

by Mahesh |
బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ తీర్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొంతకాలంగా భారత్‌లో వివాదానికి కారణమైన BBC డాక్యుమెంటరికి వ్యతిరేఖంగా గుజరాత్ అసెంబ్లీ తీర్మానించి.. ఆమోదం తెలిపింది. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీ పాత్ర ఉన్నట్లు BBC ఓ డాక్యుమెంటరీ విడుదల చేసింది. దీంట్లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా.. 135 కోట్ల భారతీయ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని ఆ రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి అన్నారు. బిబిసి దేశానికి వ్యతిరేకంగా "హిడెన్ ఎజెండా"తో పని చేస్తున్నట్లు ఉందని గుజరాత్ అసెంబ్లీ తీర్మానం లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed