- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gujarat: యాంజియోప్లాస్టీ ఫెయిల్.. గుజరాత్‌లో ఇద్దరు ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmadabad)లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని బోడక్ దేవ్ ప్రాంతంలోని ఖ్యాతి ఆస్పత్రి యాజమాన్యం బోరిసానా గ్రామంలో ఈ నెల10న ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. అనంతరం 19 మంది రోగులను యాంజియోఫ్లాస్టీ (Angioplasty) చికిత్స చేయాలని చెప్పగా వీరంతా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అనంతరం వీరిలో ఏడుగురికి యాంజియోప్లాస్టీ ఆపరేషన్ చేశారు. అయితే సర్జరీ తర్వాత నాగర్‌భాయ్ సేన్మా (59), మహేష్ బరోట్ (45) అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద ప్రభుత్వ పథకం కింద వైద్య బిల్లులను పొందడానికి హడావిడిగా ఆపరేషన్ ప్రక్రియను నిర్వహించారని ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.