- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Parliament Attack: పార్లమెంటుపై దాడికి 23 ఏళ్లు.. అమరులకు నివాళులర్పించిన నేతలు
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఉగ్రదాడి(Terror attack on Parliament) జరిగి 23 ఏళ్లు అయిన సందర్భంగా అమరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) నివాళులర్పించారు. ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా దేశం పోరాడుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ దృఢసంకల్పంతో ఉందన్నారు. అమరులైన వారికి దేశం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. "2001లో పార్లమెంటును రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులకు నా హృదయపూర్వకమైన నివాళులర్పిస్తున్నా. వారి ధైర్యం, నిస్వార్థ సేవ మాకు స్ఫూర్తినిస్తూనే ఉంది. వారందరికీ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా" అని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.
పార్లమెంటుపై దాడి
ఇకపోతే, 2001న పార్లమెంట్ కాంప్లెక్స్‌పై(2001 terror attack) పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చారు. కాగా.. పార్లమెంటు దాడిలో అమరులైనవారికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్(Vice President Jagdeep Dhankhar), ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi), లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla), కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా కేంద్రమంత్రులు, ఎంపీలు పూలమామలు వేసిన నివాళలుర్పించారు. సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది అమరవీరులకు సంతాపం తెలిపారు. అమరులను గుర్తుచేసుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా అమరవీరులకు ఉభయసభల్లో అమరులకు నివాళులర్పించారు.