Sri Lankan Airlines : మనవడికి రామాయణ కథ చెప్పిన అమ్మమ్మ..వైరల్ గా శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ వీడియో

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-12 10:35:10.0  )
Sri Lankan Airlines : మనవడికి రామాయణ కథ చెప్పిన అమ్మమ్మ..వైరల్ గా శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక అమ్మమ్మ(Grandmother)తన మనవడి (Grandson)కి రామాయణ(Ramayana) కథను చదువుతున్న దృశ్యంతో సాగిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌(Sri Lankan Airlines)వీడియో వైరల్(viral) గా మారింది. తమ దేశంలోని టూరిజం ప్రాంతాలను ప్రమోట్ చేసుకునే క్రమంలో ఆ దేశంలోని రామాయణానికి సంబంధించిన ప్రదేశాలను ప్రపంచానికి చూపించేందుకు ఒక అద్భుతమైన వీడియోను శ్రీలంక ఎయిర్ లైన్స్ విడుదల చేసింది. హిందూ మహాకావ్యం రామాయణంలోని నిజమైన స్థలాలను చూడండంటూ రూపోందించిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఒక అమ్మమ్మ తన మనవడికి రామాయణ కథను బొమ్మల పుస్తకంలో చదువుతున్న దృశ్యంతో సాగిన వీడియోలో అశోక వనం, సీతను ఉంచిన ఎల్లాలోని రావణ గుహ, రామాయణంతో ముడిపడిన ప్రదేశాలను చూపించారు. మనవడు రామాయణ కథను ఆసక్తిగా వింటూ తనకు వచ్చిన సందేహాలపై తన అమ్మమ్మను ప్రశ్నలడగడం..ఆమె రామాయణ విశేషాలను మనవడికి వివరించడంతో వీడియో ముందుకు సాగుతోంది. చివరగా మనవడు ఐ లవ్ దీజ్ రామాయణ స్టోరీ అని, నేను అందులోని ప్రదేశాలను చూడాలని చెప్పడం..శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ కనిపించడంతో వీడియో ముగిస్తోంది.

Advertisement

Next Story