- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోయల్ రాజీనామా అనుమానాలకు దారితీస్తోంది: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థలను ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణచి వేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ఇది సరైన పద్దతి కాదని దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల కమిషనర్ గోయల్ రాజీనామా నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు గోయల్ రాజీనామా పలు అనుమానాలకు దారి తీస్తుందని దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ ప్రభుత్వంతో విభేదాల కారణంగా గోయల్ రిజైన్ చేశారా? లేదా వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగారా? ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా లాగా రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా? ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వాలని తెలిపారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ముర్ము సైతం ఆమోదించారు. అయితే గోయల్ రిజైన్‌కు గల కారణాలపై స్పష్టత లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.