Eknath Shinde: స్వతంత్రంగా, స్వీయ ఎదుగుదల కోసం మహిళలకు ఆర్థిక సహాయం

by S Gopi |
Eknath Shinde: స్వతంత్రంగా, స్వీయ ఎదుగుదల కోసం మహిళలకు ఆర్థిక సహాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలో మహిళలను మరింత స్వతంత్రంగా, స్వావలంబనగా మార్చేందుకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండె అన్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. లడ్కీ బెహన్ యోజనతో పాటు ఇతర పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తాం. వారి ఖాతాలలో వివిధ పథకాల కింద డబ్బు జమ అవుతోంది. అందుకే వారు గౌరవంతో తనకు రాఖీ కట్టారు. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను. భవిష్యత్తులో మహిళలను మరింత స్వతంత్రంగా, స్వయంగా ఎదిగేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు సహకరిస్తామని అన్నారు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం అందించే లాడ్లీ బెహనా యోజన పథకం ప్రతిపక్షాల కాళ్ల కింద నేలను కదిలిస్తోందని షిండె ఎద్దేవా చేశారు. ఇది తాత్కాలిక పథకం కాదని, మహిళలు ఈ పథకం నుంచి ఎంతో ప్రయోజనం పొందుతారని తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.

Advertisement

Next Story