అవసరమైతే అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో మార్పునకు సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్

by S Gopi |
అవసరమైతే అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో మార్పునకు సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అవసరమైతే అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో మార్పునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రకటనలో అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, అగ్నివీర్‌ల భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది. రక్షణ దళాల్లో యువతరం అవసరమని, 'సేనా నే యూత్‌ఫుల్‌నెస్ హోనీ ఛాహియే'. యువత మరింత ఉత్సాహంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. వారంతా టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్నవారు. అగ్నివీర్ నియామకాల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. వారి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అవసరమైతే రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో మార్పు చేస్తామని ' మంత్రి వివరించారు. ఇదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా భారత్‌ను ఇంజిన్‌లు ఎగుమతి చేసే దేశంగా మార్చాలని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి అన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఇంజన్‌లను తయారు చేయవచ్చు, టెక్నాలజీ కోసం ఏ దేశాలు సిద్ధంగా ఉన్నాయో అన్వేషించాలని డీఆర్‌డీఓను కోరాము. తద్వారా భారత్‌ను ఇంజన్‌లను ఎగుమతి చేసే దేశంగా మార్చాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story