పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా?

by Prasanna |
పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్ : రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది.అలాగే గాలి కూడా చల్లగా వీస్తుంది.ఉత్తర భారతంలో పొగ మంచు కారణంగా రోడ్లపై వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. చలి తీవ్రత బాగా పెరగడంతో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.చలి మాత్రమే కాకుండా వడగళ్ల వాన కూడా కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పిల్లలు ఇబ్బంది పడకుండా పాఠశాలలకు 4 రోజులు సెలవులు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు మంజూరు చేసారు.

Advertisement

Next Story